అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maruti Suzuki | దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకీ దూసుకుపోతోంది. గతేడాది అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా మారుతి డిజైర్ నిలిచింది. గతనెలలో మాత్రం అత్యధికంగా అమ్ముడైన మోడల్ స్థానాన్ని బాలెనో దక్కించుకుంది. ఈ కారు కూడా మారుతి సుజుకీకే చెందినది కావడం గమనార్హం.
జీఎస్టీ సంస్కరణలతో (GST Reforms) భారత్‌లో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రీమియం కార్లపైనా జీఎస్టీతోపాటు సెస్‌ను తగ్గించింది. దీంతో కార్ల ధరలు గణనీయంగా తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ధర తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కార్ల అమ్మకాలు 2024 సంవత్సరం కన్నా 2025లో 6 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులోనూ మారుతి సుజుకీ ముందుంది. గతేడాది బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా మారుతి సుజుకీ డిజైర్ (Maruti Suzuki Dzire) నిలిచింది.
మారుతి సుజుకీ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ భారతదేశంలో మొత్తం 2.14 లక్షల యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్‌కి చెందిన ప్రసిద్ధ ఎస్యూవీ మోడల్ క్రెటా 2,01,000 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో ఉంది. కాగా గత నాలుగు దశాబ్దాలలో ఒక సెడాన్ మోడల్ ఒక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకు ముందు 2018లో కూడా డిజైర్ ఈ ఘనత సాధించింది.
Maruti Suzuki | డిసెంబర్లో బాలెనో జోరు..
డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ బాలెనో నిలిచింది. గతనెలలో ఈ మోడల్ 22,108 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో 20,700 యూనిట్లతో మారుతి ఫ్రాంక్స్, 19,400 యూనిట్లతో టాటా నెక్సాన్ ఉన్నాయి.
Maruti Suzuki | జీఎస్టీ తగ్గింపు ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. మారుతి బాలెనో ధర రూ.86,100 వరకు తగ్గింది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5,98,900 నుంచి రూ. 9,09,900 గా ఉంది. మారుతి డిజైర్ ధర రూ. 87,700 వరకు తగ్గింది. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6,25,600 నుంచి రూ. 9,31,300 వరకు ఉంది.
Maruti Suzuki | భద్రతా రేటింగ్‌లు..
భారత్ ఎన్‌క్యాప్(NCAP) పరీక్షలో మారుతి బాలెనో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించగా.. మారుతి డిజైర్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొంది ఫ్యామిలీ కార్లలో అత్యంత సురక్షితమైనదిగా నిలిచింది.