అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ కనిష్టాల వద్ద కొనుగోళ్లకు పాల్పడుతుండడంతో మార్కెట్ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. ఇంట్రాడేలో రూపాయి విలువ బలపడడం, భారత్, ఈయూల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకోవడం వంటి కారణాలతో మార్కెట్లో ఆశావాదం కనిపిస్తున్నా.. తీవ్ర ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 101 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 348 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో వెంటనే కోలుకుని 811 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 131 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 252 పాయింట్లు పెరిగింది. అయితే ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో మళ్లీ సూచీలు పడిపోయాయి. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 179 పాయింట్ల నష్టంతో 81,358 వద్ద, నిఫ్టీ (Nifty) 28 పాయింట్ల నష్టంతో 25,020 వద్ద ఉన్నాయి.
మెటల్ స్టాక్స్‌లో కొనసాగుతున్న జోరు..
బీఎసఈలో మెటల్ ఇండెక్స్ 1.75 శాతం, పీఎస్‌యూ 0.53 శాతం, సర్వీసెస్ 0.45 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.36 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.32 శాతం లాభాలతో ఉండగా.. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.79 శాతం, టెలికాం 0.77 శాతం, ఆటో 0.69 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.69 శాతం, ఎఫఎంసీజీ 0.61 శాతం, హెల్త్‌కేర్ 0.41 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.19 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం నష్టాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో ఉండగా.. 18 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 5.13 శాతం, అదానిపోర్ట్ట్స్ 2.94 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 22.52 శాతం, ఎన్టీపీసీ 1.41 శాతం, టాటా స్టీల్ 1.15 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : కొటక్ బ్యాంక్ 3.83 శాతం, ఎంఅండఎం 3.75 శాతం, మారుతి 2.62 శాతం, ఎటర్నల్ 1.97 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.24 శాతం ƒనష్టాలతో ఉన్నాయి.