Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Police | ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత

Bodhan Police | ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత

ఆటోలో తరలిస్తున్న గంజాయిని బోధన్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Bodhan Police | వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులకు గంజాయి లభ్యమైంది. ఈ ఘటన బోధన్​ (Bodhan) పట్టణ శివారులో చోటు చేసుకుంది.

బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ (Bodhan ACP Srinivas) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బిలోలి నుంచి బోధన్​ వస్తున్న ఆటోను పోలీసులు తనిఖీ చేశారు. ఆటోలో బిలోలికి చెందిన గోనివర్​ గణేష్​, బోధన్​కు చెందిన శేఖర్​, షేక్​ అబ్దుల్​ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కిలో 270 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు బిలోలి (Biloli) నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు ఆయన చెప్పారు.

Must Read
Related News