అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ramarthi Gopi | నగరంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి (Sudarsan Reddy), షబ్బీర్ అలీ (Shabbir Ali) సమక్షంలో.. రామర్తి గోపి ఆధ్వర్యంలో 7వ డివిజన్‌కు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
Ramarthi Gopi | రెండున్నరేళ్లుగా..
ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా 7వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా రామర్తి గోపి కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. 7వ డివిజన్లో రామర్తి గోపి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో 7వ డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌ఛార్జి పురంశెట్టి నంద కిషోర్, బీజేపీ సీనియర్ నాయకుడు బంటు రామ్ కుమార్, బీజేపీ బూత్ అధ్యక్షులు వంకాయల నరేష్, కనకరాజు, బీజేపీ కార్యకర్తలు నవీన్, ఉదయ్, రామ్ తదితరులు ఉన్నారు.