అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal MLA | కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు చేరారు. డోంగ్లీ మండలం (Dongli mandal) మోగా గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షుడు, యువ నాయకులు, కార్యకర్తలు బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (Jukkal MLA camp office) శుక్రవారం వీరికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantarao) కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరడం శుభపరిణామమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్న బీజేపీకి బుద్ధి చెప్పి.. గద్దె దించే వరకు మన నేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు.