అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mana Shankara varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఈ నెల 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో (Director Anil Ravipudi) తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండనుంది. దీంతో ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతించాలని చిత్ర బృందం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 11న ప్రీమియర్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర (Premier Show Ticket Price)ను రూ.600గా నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించింది. పెరిగిన రేట్లు వారం పాటు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఏపీలో సైతం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. అక్కడ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు. జనవరి 12 నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం (AP Government) ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా రేటు పెంచుకోవచ్చని తెలిపింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వడం గమనార్హం.
Mana Shankara varaprasad Garu | హైకోర్టు చెప్పినా..
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాజాసాబ్ మూవీ (Raja Saab Movie) టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను శుక్రవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్ని సార్లు చెప్పినా.. రేట్లు ఎందుకు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా మరోసారి ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. దీనిపై హైకోర్టు (High Court) ఎలా స్పందిస్తుందో చూడాలి.
