అక్షరటుడే, వెబ్‌డెస్క్: MSVG on OTT | మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankar Varaprasad Garu) సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా హక్కులను జీ–5 దక్కించుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి (Megastar Chranjeevi) హీరోగా తెరకెక్కిన సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లను రాబట్టింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ అడియన్స్‌ను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) కామెడి, చిరంజీవి మేనరిజంతో బంపర్‌హిట్ అయింది. థియేటర్లలో సందడి చేసిన సినిమా ఇక ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 11 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో టాకీస్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో చూడటానికి సిద్ధం అవుతున్నారు.
MSVG on OTT | రూ.360 కోట్ల కలెక్షన్లు
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార (Nayanatara) హీరోయిన్గా నటించారు. సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచిన ఈ మూవి ప్రపంచ వ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ఇంకా రన్ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.