అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mopal | గంజాయి తాగిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మోపాల్ (Mopal) ఎస్సై యాదాగౌడ్ (SI Yada Goud) తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ ఎక్స్ రోడ్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మోపాల్‌కు చెందిన భామన్ బహదూర్‌ను పోలీసులు ఆపారు. లైసెన్స్ పత్రాలు తనిఖీ చేస్తుండగా అతడి వద్ద నుంచి గంజాయి వాసన వస్తుండడంతో అతడి బైక్‌ను తనిఖీ చేశారు. బైక్‌లో 45గ్రాముల ఎండు గంజాయిని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయిని, బైక్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
