అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ajit Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharashtra Deputy CM) అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court) పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
బారామతిలో విమానం కూలిపోయి అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రన్‌వేకు కొద్ది దూరంలో కొండపై రాయిని ఢీకొంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అజిత్ పవార్‌తో సహా అందులోని ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అక్రమాలు జరిగే అవకాశం ఉందని బెనర్జీ అన్నారు.
Ajit Pawar | షాక్‌కు గురి చేసింది
మమత బెనర్జీ (Mamata Banerjee) మీడియాతో మాట్లాడుతూ.. పవార్ మరణ వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ సంఘటన దేశానికి తీవ్ర నష్టంగా అభివర్ణించారు. రాజకీయ నాయకులకు కూడా భద్రత లేదని ఆమె అన్నారు. పవార్ బీజేపీని వీడాలని ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియా (Social Media)లో ఇటీవల ప్రసారం అయిన ప్రకటనలను ఆమె ప్రస్తావించారు. ఈ ఘటన అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు మాత్రమే విశ్వసనీయంగా ఉంటుందని అన్నారు.కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడి నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అజిత్ పవార్ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కోరారు.