అక్షరటుడే నిజామాబాద్ సిటీ: SKM | మోదీ సర్కారు కార్మిక, రైతు, కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12న జాతీయస్థాయిలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర బాధ్యులు ప్రభాకర్ పేర్కొన్నారు. నగరంలోని (Nizamabad city) కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో బుధవారం సమావేశం నిర్వహించారు.
SKM | బ్రిటిష్ కాలంలో పోరాడి..
కిసాన్ మోర్చా జిల్లా కమిటీ సమావేశానికి పెద్ది వెంకట్ రాములు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర బాధ్యులు. ప్రభాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం (Modi government) రద్దు చేస్తూ కార్మిక లోకానికి ద్రోహం చేస్తోందన్నారు. దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతాంగం సాధించుకున్న సబ్సిడీలను, ఎంఎస్పీ చట్టాన్ని అడ్డుకోవడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పోరేట్లకు దాసోహం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె..
మోదీ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా రైతాంగం, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం సభ్యులు దేవారాం, రాజేశ్వర్, బొంబాయి గంగారాం, సురేష్, బాబన్న, కిషన్, పోషన్న తదితరులు పాల్గొన్నారు.