అక్షరటుడే, వెబ్డెస్క్: Burgula Indira Vinod | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (Nizamabad Municipal Corporation) ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 41వ డివిజన్ బీజేపీ అభ్యర్థిని బూర్గుల ఇందిర వినోద్ (BJP candidate Burgula Indira Vinod) ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనన గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని వివరించారు. ఆయా కాలనీల్లో సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపడతామన్నారు.
అందరి సహకారంతో..
41వ డివిజన్ను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని ఇందిరా వినోద్ హామీ ఇచ్చారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సహకారం తీసుకుని డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. బీజేపీతోనే నగరంలోని అభివృద్ధి సాధ్యమని వివరించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని పేదలకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు.