అక్షరటుడే, బోధన్: Bodhan ACP office | బోధన్‌లో మున్సిపల్ ఎన్నికలకు (municipal elections) సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై ఆరా తీశారు. కేసుల పరిష్కారంపై ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Bodhan ACP office | పాత నేరస్తుల బైండోవర్..
సీపీ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సమయంలో ప్రతి సెంటర్ (polling center) వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేవిధంగా పోలీసుశాఖ ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు.
Bodhan ACP office | ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి..
పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సీపీ సూచించారు. డివిజన్లోని ఆయా పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో సైబర్ క్రైంపై కళాశాలలో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై వారి సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.