అక్షరటుడే, బాల్కొండ: Mla Prashanth Reddy | ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు (Mackerel purchasing centers) ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం వేల్పూర్‌లో (Velpur) ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా, అలాగే నిజామాబాద్ జిల్లాలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికొచ్చిందని.. దాదాపు 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయన్నారు.
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు కోసిన పంటను నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. దీంతో ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు.
రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ (Warangal) రైతు డిక్లరేషన్‌లో (Farmer Declaration) అన్ని పంటలను మెరుగైన మద్దతు ధర ఇస్తామని చెప్పిన హామీ అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2,800లకు మక్కలు కొనుగోలు చేయాలన్నారు. అలాగే సోయా కూడా చేతికొస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించాలని కోరారు.