అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా, నాయకులు నరేష్ జాదవ్, రామ్ భూపాల్ తదితరులు కలిసి సన్మానించారు.