అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO Listing | దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Domestic stock market) బుధవారం మెయిన్ బోర్డ్‌కు చెందిన మూడు కంపెనీలు లిస్టయ్యాయి. శ్రీలోటస్ డెవలపర్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించగా.. ఎన్‌ఎస్‌డీఎస్ సైతం పరవాలేదనిపించింది. ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్ మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభమైంది.
IPO Listing | శ్రీ లోటస్ డెవలపర్..
నివాస, వాణిజ్య ప్రాంగణాలను నిర్మించడంలో పేరున్న ముంబయికి చెందిన శ్రీ లోటస్ డెవలపర్(Sri Lotus Developers) కంపెనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 792 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో(IPO)కు వచ్చింది. కంపెనీ షేర్లు బుధవారం లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 150 కాగా 18.67 శాతం ప్రీమియంతో రూ. 178 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే ఒక్కో షేరుపై రూ. 28, లాట్(వంద షేర్లు)పై రూ. 2,800 లాభం(Profit) వచ్చిందన్న మాట. లిస్టింగ్ తర్వాత షేరు ధర మరింత పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రూ. 187 వద్ద ట్రేడ్ అవుతోంది.
IPO Listing | ఎన్‌ఎస్‌డీఎల్..
ఐపీవో ద్వారా ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL) కంపెనీ రూ. 4,011.60 కోట్లు సమీకరించింది. గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు (Equity share) ధర రూ. 800 కాగా పది శాతం ప్రీమియంతో రూ. 880 వద్ద ట్రేడిరగ్ ప్రారంభించాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ. 80, లాట్(18 షేర్లు)పై రూ. 1,440 లాభం వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రూ. 910 వద్ద ట్రేడ్ అవుతోంది.
IPO Listing | ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్..
రూ. 650 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్ (M&B Engineering) ఐపీవోకు వచ్చింది. కంపెనీ షేర్లు బుధవారం లిస్ట్ అయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్ బాండ్ (Upper price band) వద్ద రూ. 385 కాగా అదే ధర వద్ద ప్రస్థానాన్ని ప్రారంభించాయి. లిస్టి అయ్యాక షేరు ధర కాస్త పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 4 శాతం లాభంతో రూ. 400 వద్ద ట్రేడ్ అవుతోంది.