అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోగితో పాటు, బంధువులు, అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డారు.
నగరంలోని కంఠేశ్వర్ (Kanteshwar) బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట (Nandipet) మండలం చిక్లి గ్రామానికి చెందిన వ్యక్తిని బంధువులు అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వస్తున్నారు. బైపాస్ వద్ద అంబులెన్స్‌ను లారీ ఢీకొంది. అంబులెన్స్ డ్రైవర్ రమేష్, ఈఎంటీ నాగిని తీవ్రంగా గాయపడ్డారు. రోగి, ఆయన బంధువులకు సైతం గాయాలయ్యాయి. వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ రూరల్ పోలీసులు (Nizamabad Rural Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.