అక్షరటుడే, లింగంపేట : Lingampet | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మార్గంలో లింగంపల్లి(Lingampalli) కుర్దు వద్ద పాముల వాగు ఉధృతికి రోడ్డు తెగిపోయింది.
దీంతో మూడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి మరమ్మతులు చేశారు. దీంతో వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ(Lorry) మంగళవారం ఉదయం ఈ మార్గంలో వెళ్లింది. దీంతో తాత్కాలిక రోడ్డుపై అది దిగబడింది. స్థానికులు ప్రయత్నించినా బయటకు రాలేదు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఫలితంగా ప్రజలు ఐలాపూర్(Ailapur) మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.