Kitchen medicine Garlic | చీప్​గా చూస్తారు..ఏరి పారేస్తారు..కానీ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రమని తెలుసా..?
Kitchen medicine Garlic | చీప్​గా చూస్తారు..ఏరి పారేస్తారు..కానీ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రమని తెలుసా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kitchen medicine Garlic : వంటింట్లో ఓ మూలన పడి ఉండే వెల్లుల్లి చేసే ప్రయోజనాల గురించి తెలుసా..భోజనం చేసేటప్పుడు దీనిని తినకుండా ఏరిపారేస్తుంటారు. కానీ, దీని వాడకంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒంట్లోని కొలెస్ట్రాల్(cholesterol) స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్‌తో సైతం పోరాడే వైద్య లక్షణాలను కలిగి ఉందని ఒక పరిశోధన కథనం. శాస్త్రవేత్తలు, పరిశోధకుల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన రీసెర్చ్ గేట్‌లో సైతం దీని గురించి ప్రచురితమైంది.

వెల్లుల్లిలో అనేక బయోయాక్టివ్ ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు(bioactive organosulfur compounds) ఉన్నాయట. వీటిలో అల్లిసిన్ కనిపిస్తుంది. అల్లిసిన్ క్యాన్సర్‌తో పోరాడే శక్తిని కలిగి ఉండటం గమనార్హం.

Kitchen medicine Garlic : ఆయుర్వేదం(Ayurveda) ప్రకారం..

  • ఆయుర్వేదంలో.. వెల్లుల్లిని ‘యాంటీ పవర్ క్యాన్సర్’ anti-power cancer అని పిలుస్తుంటారు. ఇందులో లభించే అల్లిసిన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనం. ఇది ఫ్లూ, శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.
  • ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం శరీరానికి ప్రయోజనకరంగా పేర్కొంటారు. నిత్యం ఉదయం వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా bacteria, వైరస్ virus , ఫంగస్‌ Fungi లను నివారిస్తుంది.
  • వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
  • రక్త ప్రసరణను పెంచుతుంది.
  • గుండె ఆరోగ్యానికి తోడ్పాటు అందిస్తుంది.
  • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
  • జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది.
  • వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
  • ముక్కులోని మురికిని తొలగిస్తుంది.
  • శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

కాగా, వేసవిలో మాత్రం వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. పచ్చి వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.