Life imprisonment | సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో 18 ఏళ్లకు తీర్పు..నిందితుడికి జీవిత కారాగారం

అక్షరటుడే, ఇందూరు: Life imprisonment :  నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ పరిధిలో 2007లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిందితుడికి 18 ఏళ్లకు శిక్ష పడింది. పొరుగింటి వారితో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి హత్య వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్​ పరిధి మామిడిపల్లికి చెందిన దండుగుల తిర్మల్​, అతని భార్య సావిత్రికి వీరి పొరుగున ఉన్న చంద్రకళతో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో మే […]

అక్షరటుడే, ఇందూరు: Life imprisonment :  నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ పరిధిలో 2007లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిందితుడికి 18 ఏళ్లకు శిక్ష పడింది. పొరుగింటి వారితో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి హత్య వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆర్మూర్​ పరిధి మామిడిపల్లికి చెందిన దండుగుల తిర్మల్​, అతని భార్య సావిత్రికి వీరి పొరుగున ఉన్న చంద్రకళతో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 8, 2007న రాత్రి సమయంలో భార్యాభర్తలు కలిసి చంద్రకళపై దాడి చేశారు. అనంతరం అదేరోజు అర్ధరాత్రి చంద్రకళ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.

ఈ కేసు గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. చివరికి సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉమెన్స్ కమ్​ ఫోర్త్ అడిషనల్​ జడ్జి, న్యాయమూర్తి టి.శ్రీనివాస్​ తుదితీర్పునిచ్చారు. నిందితుడు తిర్మల్​ కు జీవిత కారాగార శిక్ష తోపాటు రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...