అక్షరటుడే, గాంధారి: Leopard Attack | గాంధారి(Gandhari) మండలంలో చిరుత కలకలం సృష్టిచింది. గొర్రెల మందపై దాడిచేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని మేడిపల్లి(Medipally) గ్రామంలో గౌరారం అటవీ శివారులోకి గొర్ల కాపర్లు గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. అయితే మందపై శనివారం సాయంత్రం చిరుత ఒక్కసారిగా దాడిచేసింది. ఓ గొర్రెను చంపేసిందని బాధితుడు కురుమ సంతోష్ తెలిపాడు.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న రేంజ్ అటవీశాఖ (Range Forest Department) అధికారులు ఆదివారం సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుత ఆనవాళ్లను తెలుసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించారు.
ఈ విషయమై ఎఫ్ఆర్ఓ(FRO) హేమచందనను వివరణ కోరగా చిరుత దాడి వాస్తవమేనన్నారు. అటవీ ప్రాంతంలో చిరుతలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. బాధితుడికి నష్టపరిహారం అందేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు అక్బర్, సాయిలు, మల్లేష్ పాల్గొన్నారు.