Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి
Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా జడ్జి జీవీఎన్​ భరతలక్ష్మి(Judge GVN Bharathalakshmi) పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో పోలీస్​శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్​క్యాంప్​ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాంప్​లో విద్యార్థినులకు ఈవ్​టీజింగ్​ను ఎదుర్కొనే మెళకువలు నేర్పించడం అభినందనీయమన్నారు. కేరీర్​ బిల్డప్​ (Career Buildup) కంటే క్యారక్టర్​ బిల్డప్ (Character Buildup)​ అనేది చాలా ముఖ్యమైందన్నారు.

అనంతరం పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) మాట్లాడుతూ.. ప్రధానంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ క్యాంప్​ నిర్వహిస్తున్నామన్నారు. క్యాంప్​లో విద్యార్థినులకు తైక్వాండో (Taekwondo), సెల్ఫ్​ డిఫెన్స్ (Self-defense)​ శిక్షణనిచ్చామన్నారు. వేసవి సెలవును సద్వినియోగం చేసుకుని లక్ష్యంవైపు దూసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్​ సాయికిరణ్​, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్​స్పెక్టర్​ కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, జేసీఐ సభ్యులు విజయానంద్, ఆర్​బీవీఆర్​ఆర్​ సొసైటీ సభ్యులు మహేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.