HomeUncategorized​ Kamareddy | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. పలువురి అరెస్ట్

​ Kamareddy | భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. పలువురి అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: ​ Kamareddy | పట్టణంలో అనుమతి లేకుండా బండరాళ్లను పగులగొట్టేందుకు ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను (Explosives) పోలీసులు దాడి చేసి గురువారం పట్టుకున్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో (Kamareddy Town Police Station) కామారెడ్డి సబ్​ డివిజన్ (Kamareddy Sub-Division)​ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) వివరాలు వెల్లడించారు. గురువారం పట్టణంలోని ప్రోబెల్స్​ స్కూల్ (Probells School) సమీపంలోని కేపీఆర్ కాలనీలోని ఓపెన్ ప్లాట్​లో బండరాళ్లను బ్లాస్టింగ్​ చేస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.

ముగ్గురు వ్యక్తులు జిలెటన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డెక్స్ వైర్లను ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలిలో తనిఖీ చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి శ్రీధర్ అనే వ్యక్తి ఓపెన్ ప్లాట్​లో బండరాళ్లను తొలగించడానికి బండరాళ్లకు డ్రిల్లింగ్ చేసి పేలుడు పదార్థాలు అమర్చి పేల్చివేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా బండరాళ్లను పగులగొట్టడానికి ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల పిల్లలకు, చుట్టు పక్కల ప్రజలకు ప్రాణహాని కలిగేవిధంగా పేలుళ్లు జరిగే అవకాశాన్ని పోలీసులు తెలుసుకున్నారు.

Kamareddy | బండరాళ్లు పగులగొట్టేందుకు అడ్వాన్స్..

బండరాళ్లను పగులగొట్టేందుకు ప్లాట్ యజమాని శ్రీధర్ దగ్గర రూ.50 వేలకు మాట్లాడుకుని రూ.5వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. పగులగొట్టడానికి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు లింగాపూర్ (Lingapur) గ్రామ శివారులోని శ్రీవారి ఎకో టౌన్ షిప్ వెంచర్ దగ్గర నుండి తెచ్చారని పోలీసులు తెలుసుకున్నారు. వెంచర్లోని రాళ్లను తొలగించడానికి శంకర్, స్వామి అనే వ్యక్తుల ద్వారా ఈ పేలుడు పదార్థాలు తెప్పించి వెంచర్​లోని రేకుల షెడ్డులో అధిక మొత్తంలో జెలిటన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు ఉంచినట్టు తెలియడంతో సీఐ ఆధ్వర్యంలో వెంచర్​లోని రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డికి చెందిన బొంత సంపత్, నల్గొండ జిల్లా కటంగూర్ మండలానికి చెందిన బొంత లక్ష్మీనారాయణ, మెడికల్ కాలేజీ రోడ్డు దేవునిపల్లికి చెందిన బొంత రాజు, కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన చింతల శ్రీధర్​లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Kamareddy | పోలీసులు స్వాధీనం చేసుకున్నవివే..

పోలీసులు స్వాధీనం చేసుకున్నవాటిలో 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్స్, 16 కార్డెక్స్ వైర్లు బండల్స్(సుమారు 4300 మీటర్లు) 1 బ్యాటరీ, 1 చెక్ మీటర్, 2 బైక్​లు, మొబైల్స్ ఉన్నాయి.