అక్షరటుడే, మెండోరా: Panchayat Elections | జిల్లాలో పంచాయతీ మూడో విడత ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. భీమ్‌గల్ (Bheemgal) మండలంలోని మెండోరా (Mendora) గ్రామ సర్పంచ్‌గా కుంట లక్ష్మి రమేశ్ విజయం సాధించారు.
కాంగ్రెస్ మద్దతుదారు కుంట లక్ష్మి రమేశ్, బీజేపీ బలపర్చిన అభ్యర్థిపై 861 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. లక్ష్మి రమేశ్‌కు 1277 ఓట్లు రాగా.. బీజేపీ మద్దతుదారుకు 416 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుదారుకు 328 ఓట్లు, నోటాకు 18 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా సర్పంచ్‌గా విజయం సాధించిన కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ.. తమను గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు శాయాశక్తులా కృషి చేస్తామని చెప్పారు.