అక్షరటుడే, ఇందూరు : Kundarapu Ranjith Campaign Rally | తనను కార్పొరేటర్ (Corporator)గా గెలిపిస్తే 50 డివిజన్ను కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మజ్దూర్ జనతా పార్టీ (Mazdoor Janata Party) అభ్యర్థి కుందారపు రంజిత్ తెలిపారు. డివిజన్లోని పెద్దబజార్, ఠానాగల్లీ, బ్రహ్మపురి, గాజులపేట కాలనీలో (Gajulapeta Colony) ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
Kundarapu Ranjith Campaign Rally | డివిజన్ సమస్యలపై అవగాహన ఉంది..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని రంజిత్ తెలిపారు. ప్రధానంగా వృద్ధులకు పెన్షన్లు, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను (Double Bedroom Houses) అందేలా చూస్తానన్నారు. మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. యువకులను ప్రోత్సహించి గెలిపించాలని అభ్యర్థించారు. డివిజన్ అభివృద్ధితోపాటు డివిజన్ వాసుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యత అన్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా వాటిని అమలుపర్చడమే తన లక్ష్యమన్నారు.