అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy in Choppadandi | కారు దందాలో రూ.కోట్లు సంపాదించిన కేటీఆర్‌ను జైల్లో వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలోని గుమ్లాపూర్ సభలో ఆయన మాట్లాడారు.
బతుకమ్మ చీరల్లో (Bathukamma sarees) కూడా కమీషన్లు వదలని మీదీ ఒక బతుకేనా అంటూ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను ఏ రోజైనా మహిళలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఇందిరమ్మ చీరలను సంతోషంగా కట్టుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ (KCR) జీతం కట్ చేయాలా వద్దా అని సీఎం అన్నారు. పదేళ్ల పాలనలో రూ.8.11 లక్షల కోట్లు అప్పులు చేసి, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారన్నారు. ఆయన చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు.
Revanth Reddy in Choppadandi | మేడారం జాతరను సందర్శించలేదు
కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీష్ రావు సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరను (Sammakka-Saralamma Medaram Jatara) సందర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల దేవతల ముందు తలవంచడానికి వారు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి రూ.4-5 వేల కోట్లు ఖర్చు చేసి ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Revanth Reddy in Choppadandi | బండి సంజయ్‌పై విమర్శలు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ముందు నిలబడి నిధులు అడిగే ధైర్యం ఆయనకు లేదన్నారు. బండి సంజయ్‌కు మోదీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. నిజంగా ఆయనకు మోదీ దగ్గర పరపతి ఉంటే కాళేశ్వరంలో వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్ రావును జైలులో వేయించాలని సవాల్ విసిరారు.
పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, మెట్రో రైలు రెండో విడతకు నిధులు కేంద్రం ఇవ్వడం లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇవ్వకుండా ఏ మోహం పెట్టుకుని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర సహకరించుకుంటున్నాయని ఆరోపించారు.