అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Krishnashtami | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే శ్రీకృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు (special pujas) చేశారు. పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీకృష్ణుడు, రాధ (Lord Krishna and Radha) వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.
Krishnashtami | నిజామాబాద్ నగరంలో..
కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. నగరంలోని శివాజీనగర్ ఐటీఐ వద్ద కృష్ణ మందిర్ (Krishna Temple), కంఠేశ్వర్‌లోని మురళీ కృష్ణ మందిరం, ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు.
Krishnashtami | కంఠేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో..
అక్షరటుడే, ఇందూరు: కంఠేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. లక్ష్మి కల్యాణ మండపంలో శనివారం ప్రత్యేక పూజలతో పాటు ఊయల సేవా, సంధ్యా హారతి, సప్తాహ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన బృంద నృత్యం అలరించింది. కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకులు రామానందరాయ గౌరదాస్, మాదాసు స్వామి యాదవ్, నీతాయి చందు ప్రభు, బలరాం ప్రభు, రామానంద గౌసే ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Krishnashtami | కామారెడ్డి పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో..
కామారెడ్డి పట్టణంలోని (Kamareddy Town) శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారులు ఉట్టిని కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ మందిర్ కమిటీ అధ్యక్షుడు శివాజీ రావు, జనరల్ సెక్రెటరీ గంగాధర్ రావు, సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, ఆర్కే గ్రూప్ కరస్పాండెంట్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డా.జైపాల్ రెడ్డి, భూంరావు, దత్తాత్రి, కిషన్ రావు, రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Krishnashtami | లింగంపల్లి కృష్ణ మందిరంలో..
సదాశివనగర్ మండలం (Sadhashiva Nagar Mandal) లింగంపల్లి కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మండలంలోని కల్వరాల గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
Krishnashtami | ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం (Yellareddy Mandal) అన్నాసాగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు రాధ కృష్ణ వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ దుర్గా ఆయా లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Krishnashtami | భీమ్‌గల్‌లో..
అక్షరటుడే, భీమ్‌గల్: పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో, ఎదురుచూపు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు (high school Students) కృష్ణుడు గోపి గల వేషధారణలో చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Krishnashtami | గండిమాసానిపేట్‌లో..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని వాడవాడలా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు చేశారు. చిన్నారులు కోలాటం ఆడుతూ గ్రామ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఉట్టిల కొట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టి చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణుడికి పూజలు చేశారు.