7
అక్షరటుడే, ఇందూరు: Volleyball Competitions | నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ (Kakateeya Olympiad School) విద్యార్థిని వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది.
పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న దీక్షిత జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో (district-level volleyball competitions) ఉత్తమ ప్రదర్శన ఇచ్చింది. దీంతో విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కాగా.. విద్యార్థి దీక్షిత పెద్దపల్లిలో జరుగునున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొననుందని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థిని స్కూల్ డైరెక్టర్ రామోజీ, వైస్ ప్రిన్సిపాల్ భావన, వాలీబాల్ కోచ్ సాయిలు అభినందించారు.