ePaper
More
    Homeటెక్నాలజీHero Vida VX2 | 96 పైసలతో కిలోమీటర్‌ మైలేజ్‌.. ఈవీ స్కూటర్లలో గేమ్‌ చేంజర్‌...

    Hero Vida VX2 | 96 పైసలతో కిలోమీటర్‌ మైలేజ్‌.. ఈవీ స్కూటర్లలో గేమ్‌ చేంజర్‌ అయ్యేనా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hero Vida VX2 | దేశీయ టూవీలర్‌(Two wheeler) వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ అనుబంధ సంస్థ విడా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Electric Scooter)ను ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

    వీఎక్స్‌2 పేరుతో ఇటీవల మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్ల(VX2 గో, VX2 ప్లస్‌)లో లభిస్తోంది. ఆకర్షణీయ ధరలో సూపర్‌ డిజైన్‌తో వచ్చిన ఈ మోడల్‌ స్కూటర్‌ భారత ఈవీ మార్కెట్‌లో గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది టీవీఎస్‌ ఐక్యూబ్‌(TVS iQube), బజాజ్‌ చేతక్‌, ఓలా ఎస్‌1, ఎథర్‌ రిజ్టాలకు పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ స్కూటర్ల ఫీచర్లు ఇలా ఉన్నాయి..

    కలర్స్‌: రెండు వేరియంట్లు(Variant) గ్రే, బ్లూ, రెడ్‌, యెల్లో, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్లస్‌ వేరియంట్‌లో అదనంగా ఆరెంజ్‌, గ్రే కలర్స్‌ కూడా ఉన్నాయి.

    బ్యాటరీ సామర్థ్యం: గో వేరియంట్‌ (2.2 కిలోవాట్‌ పర్‌ అవర్‌) స్వాపబుల్‌ బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్‌ 92 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని ఐడీసీ చెబుతోంది.
    ప్లస్‌ వేరియంట్‌ (3.4 కిలో వాట్‌ పర్‌ అవర్‌) బ్యాటరీతో వచ్చిన మోడల్‌ 142 KM రేంజ్‌ ఇస్తుంది. రెండు వేరియంట్లు ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేయనున్నాయి. 0 నుంచి 80 శాతం చార్జింగ్‌ కేవలం 60 నిమిషాల్లో పూర్తవుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇందులో రిమూవబుల్‌ బ్యాటరీలు అమర్చారు. దీంతో ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ సులువుగా చార్జింగ్‌ చేసుకోవచ్చు.

    స్మార్ట్‌ ఫీచర్స్‌ : వీఎక్స్‌2 ప్లస్‌లో 4.3 ఇంచ్‌ ఫుల్‌కలర్‌ TFT డిస్‌ప్లే, వీఎక్స్‌2 గోలో LCD డిస్‌ప్లే అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, రియల్‌ టైమ్‌ రైడ్‌ ట్రాకింగ్‌, రిమోట్‌ ఇమ్మొబిలైజేషన్‌, క్లౌడ్‌బేస్డ్‌ సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, రైడ్‌ మోడ్స్‌ ఉన్నాయి.

    పనితీరు: 3.9 kW రియర్‌ హబ్‌ మోటార్‌తో వీఎక్స్‌2 గో వేరియంట్‌ టాప్‌ స్పీడ్‌ 60 కి.మీ/గం., వీఎక్స్‌2 ప్లస్‌ వేరియంట్‌ 80 కి.మీ/గం. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.1 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ఎస్‌ ఎ సర్వీస్‌ (బాస్‌) మోడల్‌తో రూ. 0.96/కి.మీ. ఖర్చవుతుంది. బ్యాటరీ పనితీరు 70 శాతం కంటే తక్కువకు పడిపోతే ఉచిత బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు అవకాశం ఉంది.

    అదనపు ఫీచర్లు: 12 Inch డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ అమర్చారు. ఇవి ఈ సెగ్మెంట్‌లో అత్యంత విశాలమైన టైర్లుగా కంపెనీ చెబుతోంది. 33.2 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ కెపాసిటీతో వచ్చింది. ఫుల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్స్‌, మరియు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌. ఐదేళ్లు లేదా 50 వేల కి.మీ. వారంటీ.

    ధర:గో వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 59,490(బ్యాటరీ లీజు విధానంలో), నేరుగా బ్యాటరీ ప్యాక్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.99,490 వరకు ఉంటుంది. ప్లస్‌ మోడల్‌ ధర రూ. 1.10 లక్షలు.

    More like this

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వే(Indian Railway)లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈస్టర్న్‌...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...