ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. ఈ నెలాఖరులోగా షెడ్యూల్​

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. ఈ నెలాఖరులోగా షెడ్యూల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్ వచ్చింది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది.

    త్వరలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్​ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections) నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు (Sarpanch and Municipal elections) ఉంటాయన్నారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ (election schedule) విడుదల చేయడానికి సోమవారం జరిగే కేబినెట్​లో చర్చిస్తామన్నారు. అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామమని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికలకు (local elections) 15 రోజుల గడువు ఉందని, కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

    Local Body Elections | మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

    రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం గతేడాది జూలై 3తో ముగిసింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఎంపీపీల స్థానంలో మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరితో ముగిసింది. పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పగించింది. దీంతో 16 నెలలుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల (Special Officers) పాలనలో కొనసాగుతున్నాయి. అయితే మొదట సర్పంచ్​ ఎన్నికలకు (Sarpanch elections) బదులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తెలిపారు. దీంతో గ్రామాల్లో మరికొన్ని రోజులు ప్రత్యేకాధికారుల పాలన తప్పేలా లేదు.

    ఈ నెలాఖరులోగా షెడ్యూల్​ విడుదల చేస్తే వచ్చే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC elections) నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం పంచాయతీ ఎన్నికలు, అటు తర్వాత మున్సిపల్​ ఎన్నికలను వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Local Body Elections | రిజర్వేషన్లపై స్పష్టత కరువు

    తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఈ మేరకు కులగణన (Caste Census) చేపట్టిన విద్యా– ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి (Central Government) పంపింది. కేంద్రం ఆమోదిస్తేనే ఆ బిల్లులకు చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో కేంద్రం ఆమోదించకుంటే బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

    వాస్తవానికి రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చిలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం (Panchayat elections) సిద్ధమైంది. ఈ మేరకు ఓటరు జాబితాను కూడా విడుదల చేసింది. అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అయితే అప్పుడు ప్రభుత్వం ఎన్నికలు పెట్టలేదు. దీంతో ప్రస్తుతం వారం రోజుల్లో నోటిఫికేషన్​ విడుదల చేసి నెలలోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

    Local Body Elections | ఆశావహుల్లో ఉత్కంఠ

    స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections) ఇటీవల మంత్రులు ప్రకటనలు చేస్తుండటంతో ఆయా పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోటీ చేయడానికి పలువురు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రిజర్వేషన్​లపై క్లారిటీ రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు నాయకులు టికెట్​ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...