అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists | మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా అగ్రనేతలు లొంగిపోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలైన మల్లోజుల, ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే.
కాగా.. తాజాగా మరో కీలక నేత అయిన బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, కేంద్ర కమిటీ కీలక సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. వీరు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. అయితే వీరి లొంగుబాటులో తెలంగాణ ఐఎస్బీ (Telangana ISB) కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
Maoists | కేంద్ర కమిటీ కీలక సభ్యుడిగా చంద్రన్న
చంద్రన్న (Chandranna) మావోయిస్టు పార్టీ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. అనేక దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమానికి కీలక మార్గదర్శకుడిగా పనిచేశారు. కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీ (Maoist Party)కి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.
Maoists | స్టేట్ కమిటీ మెంబర్‌గా బండి ప్రకాశ్
మావోయిస్టు నేత బండి ప్రకాశ్ (Maoist leader Bandi Prakash) తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన దాదాపు 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడైన ప్రకాశ్ 1980లో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. కీలక స్థానాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా.. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపు మేరకు చంద్రన్న అజ్ఞాతం వీడారని తెలిపారు. చంద్రన్నపై రూ. 25 లక్షల రివార్డు ఉందని వివరించారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి కీలకంగా పనిచేశారని చెప్పారు.
