Homeతాజావార్తలుJubilee Hills | జూబ్లీహిల్స్​ నామినేషన్లలో కీలక పరిణామం.. భారీగా నామినేషన్లు వేస్తున్న ఆర్​ఆర్​ఆర్​ బాధితులు

Jubilee Hills | జూబ్లీహిల్స్​ నామినేషన్లలో కీలక పరిణామం.. భారీగా నామినేషన్లు వేస్తున్న ఆర్​ఆర్​ఆర్​ బాధితులు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో పలువురు సామాన్యులు సైతం నామినేషన్లు వేస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​, ఫార్మా సిటీలతో భూములు కోల్పోతున్న వారు పోటీ చేసి తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే భారీగా నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు ఆర్ఆర్​ఆర్​, ఫార్మా సిటీ బాధితులు నామినేషన్లు వేయడానికి తరలి వచ్చారు.

మాగంటి గోపినాథ్​ మృతితో జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by Election) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్​ (Congress) యత్నిస్తుండగా.. తన సిట్టింగ్​ సీటును కాపాడుకోవాలని బీఆర్​ఎస్​ శ్రమిస్తోంది. బీజేపీ (BJP) మాత్రం ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా.. ప్రచారంలో వెనక బడింది. అయితే నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. మంగళవారం చాలా మంది నామినేషన్​ వేయడానికి తరలి వచ్చారు. దీంతో షేక్​పేటలోని ఆర్​వో కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది.

Jubilee Hills | పెద్ద సంఖ్యలో నామినేషన్లు

ఉప ఎన్నికల కోసం శనివారం సాయంత్రం వరకు 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు వచ్చాయి. ఆదివారం, సోమవారం సెలవు కావడంతో మంగళవారం చివరి రోజు నామినేషన్​ వేయడానికి చాలా మంది వచ్చారు. రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా పోటీకి సై అంటున్నారు. నిరుద్యోగులు, ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు తమ సమస్యను తెలపడానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రిటర్నింగ్‌ ఆఫీసు వద్ద సందడి నెలకొంది.

Jubilee Hills | ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్​ వేశారు. కాంగ్రెస్​ నవీన్​యాదవ్, బీఆర్​ఎస్​ (BRS) మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్​రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. అలాగే బీఆర్​ఎస్​ డమ్మీ అభ్యర్థిగా పీజేఆర్​ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్​రెడ్డి నామినేషన్​ ఫైల్​ చేశారు. పలు చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది నామినేషన్​ వేశారు.