అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ketika Sharma | అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ సినిమాల కన్నా బ్యూటీతోనే కట్టిపడేస్తుంటుంది. వెకేషన్‌కు వెళ్లిన కేతిక శర్మ సముద్ర యానం చేస్తూ షిప్లో దిగిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
షిప్ డెక్‌పై స్టైలిష్ లుక్స్‌లో కనిపించిన కేతిక అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. “చాలా రోజుల తర్వాత కేతిక నుంచి అదిరిపోయే గ్లామర్ ట్రీట్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కామెంట్ బాక్స్ మొత్తం ఫైర్ ఎమోజీలు, కాంప్లిమెంట్లతో నిండిపోయింది.1995 డిసెంబర్ 24న న్యూఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ, చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్ డబ్స్మాష్ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించిన ఆమె, అదే క్రేజ్‌తో దర్శకుల దృష్టిని ఆకర్షించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Ketika Sharma | కేతిక అందాల ఆరబోత..
2021లో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతోనే నటనకు మంచి మార్కులు కొట్టేసింది.అదే ఏడాది నాగశౌర్యతో కలిసి ‘లక్ష్య’ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2022లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభోగంగా’ చిత్రంలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో ‘బ్రో’ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
ఇటీవల ‘రాబిన్ హుడ్’, ‘సింగిల్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కేతిక, ప్రస్తుతం విజయ్ 69 సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనుంది. సినిమాల పరంగానే కాదు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్, స్టైల్‌తో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. మొత్తానికి, షిప్ వెకేషన్లో షేర్ చేసిన తాజా ఫోటోలతో కేతిక శర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నుంచి మరిన్ని సినిమాల అప్డేట్స్తో పాటు ఇలాంటి స్టైలిష్ గ్లింప్స్ కనిపించనున్నాయా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
View this post on Instagram