అక్షరటుడే, ఇందూరు:Muncipal corporation | మురికి కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్(Municipal Corporation Commissioner Dilip Kumar) సూచించారు. బుధవారం నగరంలోని బోర్గాంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రమం తప్పకుండా ఇంటింటికీ చెత్తను సేకరించాలన్నారు.
రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించి శుభ్రపర్చాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా వర్షాకాలం సమీపిస్తున్నందున లార్వా నిరోధక స్ప్రే(Larvae prevention spray) చేయాలని ఆదేశించారు. రాత్రి సమయంలో ఫాగింగ్ ఆపరేషన్లను(Fogging operations) సరిగ్గా నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యకలాపాలపై అవగాహన పెంచడానికి మైక్ ద్వారా బహిరంగ ప్రకటనలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.