అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR SIT investigation | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సిట్ విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ అధికారులు (SIT officials) పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరుగురు సిట్ అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం నంది నగర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. వారు వెళ్లగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు.
KCR SIT investigation | ముఖ్య నేతలతో సమావేశం
తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు నందినగర్ చేరుకున్నారు. ముఖ్యనేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. విచారణ సాగిన తీరుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.