అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
కవిత కొంతకాలంగా జనంబాట కార్యక్రమం (Janambata Program) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) మండిపడుతున్నారు. ఆమెపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆమె జూబ్లీహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారని తనపై కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారి తోలు తీస్తానన్నారు.
Kalvakuntla Kavitha | చిట్టా విప్పుతా
తనపై అనవసరమైన దాడి చేస్తే వారి చిట్టా మొత్తం విప్పుతానని కవిత పేర్కొన్నారు. జనంబాటలో బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నాయన్నారు. ఇది టాస్ మాత్రమేనని, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని ఆమె హెచ్చరించారు. నిత్యం కేటీఆర్ వెంట ఉండే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ (MLC Pochampally Srinivas)ను గతంలో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆయన ఫామ్‌హౌస్‌లో కోడి పందెలు నిర్వహిస్తూ దొరికిపోయారని చెప్పారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారని ప్రశ్నించారు. ‘‘ ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తా”అని కవిత వార్నింగ్ ఇచ్చారు.
Kalvakuntla Kavitha | సీఎం అవుతా..
తనకు టైం వస్తుందని కవిత అన్నారు. ఎదో ఒక రోజు సీఎం అవుతానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు (Legal Notices) పంపుతున్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై అవమానకరమైన ప్రకటనలు చేసినందుకు టీ న్యూస్, మాధవరం కృష్ణారావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీ న్యూస్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎది పడితే అది ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తామన్నారు.