అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు.
పేదలను చదువుకు దూరం చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డల చదువుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కవిత(Kalvakuntla Kavitha) సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ కమీషన్ల సర్కారు ఆడబిడ్డల చదువులను కాలరాస్తోంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రేవంత్ ప్రభుత్వం(Revanth Government) ఎగవేస్తోందన్నారు.
Fee Reimbursement | కమీషన్లు కోసం..
ప్రభుత్వం కమీషన్లకు అలవాటు పడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు విడుదల చేయడం లేదని కవిత ఆరోపించారు. “20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారంటూ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతోన్నాయి. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉంచుతున్నారని” మండిపడ్డారు. “ఇప్పటికే కాలేజీలు నడప లేక ఆర్థికంగా యాజమాన్యాలు చితికిపోయాయి.కాలేజీలు మూతపడితే చదువుకు ఆడబిడ్డలు దూరం అవుతారని” కవిత ఎక్స్ లో పోస్టు చేశారు
Fee Reimbursement | మూతబడిన కళాశాలలు..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారింది. నిధులు విడుదల చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కొరినా స్పందన రాలేదు. మరోవైపు, ప్రభుత్వంతో జరిపినా చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. రోజులాగే సోమవారం ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు మూసి ఉండడం చూసి వెనుదిరిగారు.
2 comments
[…] మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి […]
[…] ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి […]
Comments are closed.