అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karre Gutta Encounter | తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం.
కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు (Chhattisgarh Police), భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతుండటంతో కర్రెగుట్టల్లో తుపాకుల మోత మోగుతోంది. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
Karre Gutta Encounter | దేవ్‌జీ లక్ష్యంగా..
మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు –2 పేరిట కూంబింగ్ (Coombing) చేపట్టగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు సైతం చనిపోయినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా గతేడాది ఏప్రిల్‌లో సైతం కర్రెగుట్టల్లో బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుమారు 20 వేల మంది బలగాలతో కర్రెగుట్టలను జల్లెడ పట్టారు. ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు చనిపోయారు. బలగాల రాకతో మావోయిస్టులు కర్రెగుట్టలను ఖాళీ చేశారు.
Karre Gutta Encounter | మధ్యప్రదేశ్ నుంచి..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి తాజాగా కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించినట్లు సమాచారం రావడంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఐదు వేల మందితో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ సందర్భంగా కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ గడువు సమీపిస్తుండటంతో ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేసింది. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి.