Homeక్రీడలుKane Williamson | కేన్ మామ ఇలా షాకిచ్చాడేంటి.. ఆ ఫార్మాట్‌కి గుడ్‌బై చెప్పిన బ్లాక్...

Kane Williamson | కేన్ మామ ఇలా షాకిచ్చాడేంటి.. ఆ ఫార్మాట్‌కి గుడ్‌బై చెప్పిన బ్లాక్ క్యాప్స్ స్టార్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు ఈ ప్రకటన చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kane Williamson | న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు కేవలం నాలుగు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే, విలియమ్సన్ వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.35 ఏళ్ల వయసులో కూడా విలియమ్సన్ న్యూజిలాండ్ క్రికెట్‌కు (New Zealand Cricket) అద్భుతమైన సేవలు అందించాడు. అంతర్జాతీయంగా 93 టీ20 మ్యాచ్‌లు ఆడి 2,575 పరుగులు చేసిన ఆయన, కివీస్ తరపున టీ20ల్లో రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు, బెస్ట్ స్కోరు 95 పరుగులు ఉన్నాయి.

Kane Williamson | టీ20కి గుడ్ బై..

2011లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన విలియమ్సన్, చివరిసారిగా 2024లో ఇంగ్లాండ్‌పై టీ20 ఆడాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, న్యూజిలాండ్‌ను రెండు సెమీఫైనల్స్‌ (2016, 2022), అలాగే 2021లో ఫైనల్‌‌కు నడిపించి చరిత్ర సృష్టించాడు. తన రిటైర్మెంట్‌పై (retirement) విలియమ్సన్ మాట్లాడుతూ .. “చాలాకాలంగా న్యూజిలాండ్ టీ20 జట్టులో భాగం కావడం నాకు గర్వకారణం.

ఈ జ్ఞాపకాలు, అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఇది నాకు, జట్టుకు సరైన సమయం. టీ20 ప్రపంచకప్ కోసం కొత్త ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మిచ్ సాంట్నర్ (Mitch Santner) అద్భుతమైన కెప్టెన్ . ఆయన నాయకత్వంలో జట్టు మరింత ముందుకు సాగుతుందని నమ్ముతున్నాను. ఇక నేను మైదానం బయట నుంచి జట్టుకు మద్దతు ఇస్తాను,” అని వ్యాఖ్యానించాడు.

కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ (Retirement) వార్తతో న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయన కెరీర్‌ను కొనియాడుతూ, “ఎప్పటికీ క్లాస్‌ప్లేయర్!”, “కివీ లెజెండ్ ఫారెవర్!” అంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కేన్ విలియమ్సన్ కెరీర్ ముఖ్యాంశాలు చూస్తే.. టీ20 మ్యాచ్‌లు: 93, పరుగులు: 2,575, అత్యధిక స్కోరు: 95, హాఫ్ సెంచరీలు: 18. ఇక టీ20 కెప్టెన్‌గా: 2021 ఫైనల్, 2016 & 2022 సెమీఫైనల్స్‌కు నడిపించాడు. కేన్ విలియమ్సన్ నిర్ణయంతో కివీస్ జట్టు ఒక కొత్త అధ్యాయం ప్రారంభించనుంది. ఇక ఆయన అనుభవం, మార్గదర్శకత్వం రాబోయే తరం ఆటగాళ్లకు అమూల్యంగా నిలిచే అవకాశం ఉంది.