అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. ఎంతో మంది సీనియర్ నాయకులు డీసీసీ పీఠం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాన్సువాడ నియోజకవర్గంలోని (Banswada Constituency) వర్ని(Varni) మండలం కునిపూర్ గ్రామానికి చెందిన పీసీసీ డెలిగేట్ (PCC Delegate) డాక్టర్ ముత్తారెడ్డి రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు కామారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు రాజ్‌పాల్ కరోరాను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2001 నుంచి ఇప్పటివరకు 24ఏళ్ల పాటు పార్టీని వదిలి వెళ్లకుండా పార్టీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానన్నారు. 2001లో గ్రామాధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని.. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్యూఐ (NSUI) మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశానన్నారు.
2012 బాన్సువాడ అసెంబ్లీ(Banswada Assembly) యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2015లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యానని తెలిపారు. సికింద్రాబాద్, మెదక్(medak) పార్లమెంటు యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా ఐదేళ్ల పాటు పనిచేశానని పేర్కొన్నారు.
ప్రస్తుతం పీసీసీ డెలిగేట్‌గా కొనసాగుతున్నానని వివరించారు. పదేళ్ల పాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి పార్టీని బలోపేతం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ (Telanagana University ) నుండి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందానని.. ఈ అనుభవంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పదవికి న్యాయం చేయగలననే నమ్మకం తనకుందని ముత్తారెడ్డి రాజారెడ్డి వివరించారు.