Homeజిల్లాలుకామారెడ్డిCollector Ashish Sangwan | బాధ్యతలు చేపట్టి ఏడాది.. మొక్కలు నాటిన కలెక్టర్

Collector Ashish Sangwan | బాధ్యతలు చేపట్టి ఏడాది.. మొక్కలు నాటిన కలెక్టర్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Collector Ashish Sangwan | కామారెడ్డి కలెక్టర్​గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికారులు నిర్వర్తించే విధుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. కొందరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పాలనను గాడిన పెట్టడంలో కలెక్టర్ సఫలమయ్యారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, జిల్లా అధికారులు, టీఎన్జీవోస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Collector Ashish Sangwan | కలెక్టర్​కు శుభాకాంక్షల వెల్లువ..

ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ (Redcross Society) ఆధ్వర్యంలో జిల్లాలో రక్త నిల్వలు పెంచడంలో కలెక్టర్ కీలకపాత్ర పోషించారు. పలుమార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు సకాలంలో రక్తం అందేలా చేశారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్​ క్రాస్ సొసైటీ బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ (Governor Jishnu Dev Verma) చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు రావడానికి కృషి చేసినందుకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ను కలిసి సన్మానించారు.