అక్షరటుడే, కామారెడ్డి : Artisan Workers Dharna | స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం పనిభారం తగ్గించి 8 గంటల పని కల్పించాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాత కలెక్టరేట్ (Old Collectorate) సమీపంలో ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Artisan Workers Dharna | సబ్స్టేషన్లో అదనంగా విధులు..
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ప్రతి సబ్ స్టేషన్లో (Substation) ఇద్దరు, ముగ్గురికి డ్యూటీ వేస్తూ పనిభారం పెంచుతున్నారన్నారు. ఫలితంగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12, 13 రోజుల డ్యూటీ వద్దని, 8 గంటల పని సరైందని వారు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా అధికారులకు వినతిపత్రాలు అందించామని.. అయినా ఫలితం లేదన్నారు.
సమస్య పరిష్కారం కాకపోతే..
తమ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆర్టిజన్ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్టిజన్ జేఏసీ ఛైర్మన్ (Kamareddy Artisan JAC Chairman) హరికృష్ణ, కన్వీనర్ జైసింహారెడ్డి, కో ఛైర్మన్ భీంరాజు, కో కన్వీనర్ నివర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ల ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.