అక్షరటుడే, వెబ్డెస్క్: Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ Kaleshwaram Commission ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ Justice PC Ghosh బుధవారం హైదరాబాద్ Hyderabad రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన విషయమై విచారణ తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు అధికారులను కమిషన్ విచారించింది. ఈ దఫా పలువురు రాజకీయ నేతలకు నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి నోటీసులు వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు సమాచారం.గతంలో కాళేశ్వరం ఈఎన్సీలను విచారించిన కమిషన్ నివేదిక రూపొందించింది. తుది దశ విచారణ అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బీఆర్ఎస్ వరంగల్లో రజోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నాయకులను కమిషన్ విచారణకు పిలవనున్నట్లు తెలిసింది.