అక్షరటుడే, ఇందూరు: Kakatiya Olympiad School | నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ (Kakatiya Institutions) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ టూర్(Education tour) విజయవంతమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా టూర్లో పాల్గొన్నారు.
Kakatiya Olympiad School | కూరగాయలు వివరాలు తెలుసుకుంటూ..
ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు నగరంలోని గంజ్‌లో శనివారం పర్యటించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు గంజ్‌లోని కూరగాయల మార్కెట్లో (Ganj Vegetable market) క్రయవిక్రయాలను పరిశీలించారు. కూరగాయలు, పండ్లు తదితర వాటి గురించి వివరంగా తెలుసుకున్నారు.
వివరాలు తెలియజేసిన ఉపాధ్యాయులు..
ఈ సందర్భంగా విద్యార్థులకు కూరగాయలు, వాటిని తీసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలను ఉపాధ్యాయులు వివరించారు. ఆకు కూరలు, ఇతర కూరగాయలు తింటే కలిగే లాభాలు.. వాటిని పండించే విధానం.. మార్కెట్‌కు ఎలా తీసుకొస్తారనే వివరాలను చెప్పారు. రైతులతో నేరుగా విద్యార్థులను మాట్లాడించారు. ఈ టూర్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

