అక్షరటుడే, వెబ్డెస్క్ : Kajal Aggarwal | సెలబ్రిటీల గురించి చాలాసార్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా నటి కాజల్ అగర్వాల్ (Actress Kajal Aggarwa) గురించి కూడా ఓ వార్త సోమవారం వైరల్ అయింది.
సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ చనిపోయిందని పుకార్లు వచ్చాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత నటి మరణించిందని సోషల్ మీడియాలో (Social media) ప్రచారం జరిగింది.ఈ పుకార్లు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ పుకార్లపై స్పందించిన కాజల్ అగర్వాల్ అవి పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంది.
Kajal Aggarwal | తప్పుడు వార్తలు..
యాక్సిడెంట్ జరిగిందన్న వార్తలు తప్పు అని చందమామ హీరోయిన స్పష్టం చేసింది. ఈ మేరకు X, ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్టు పెట్టిన కాజల్ అగర్వాల్.. పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులను కోరింది. ‘నేను ఒక ప్రమాదంలో ఉన్నానని (ఇప్పుడు లేను!) కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా సరదాగా ఉంది ఎందుకంటే ఇది పూర్తిగా అవాస్తవం’ అని ఆమె పోస్టు చేసింది.
‘దేవుని దయ వల్ల నేను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా, చాలా బాగానే ఉన్నానని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. బదులుగా మన శక్తిని సానుకూలత, సత్యంపై కేంద్రీకరిద్దాం. ప్రేమచ కృతజ్ఞతతో, కాజల్’ అని అని తన పోస్టులో రాసుకొచ్చింది.
చాలా రోజుల గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ చివరిసారిగా విష్ణు మంచు (Vishnu Manchu) చిత్రం ‘కన్నప్ప’లో కనిపించింది. దీనితో పాటు ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ చిత్రం ‘సికందర్’లో కూడా నటించింది. ఇప్పుడు ఆమె కమల్ హాసన్ (Kamal Hassan) చిత్రం ‘ఇండియన్ 3’లో నటిస్తోంది. దీనితో పాటు, పౌరాణిక ఇతిహాసం ఆధారంగా నితేష్ తివారీ నిర్మించిన ‘రామాయణం’ చిత్రంలో కాజల్ కనిపించనుందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె రావణుడి భార్య మండోదరి పాత్రను పోషిస్తుందని చెబుతున్నారు. అయితే, రామాయణం తారాగణం గురించి సమాచారాన్ని నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు.