Homeజిల్లాలునిజామాబాద్​Armoor Town | రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతతో బీసీలకు న్యాయం

Armoor Town | రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతతో బీసీలకు న్యాయం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌ : Armoor Town | రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బీసీ సెల్‌ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు దొండి రమణ (Town President Dondi Ramana) ఒక ప్రకటనలో అన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం వర్తించేలా సామాజిక ఆర్థిక న్యాయం జరిగేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి గెజిట్‌ ఇవ్వాలని, బలహీన వర్గాలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో కేబినెట్‌ సమావేశం (cabinet meeting) ద్వారా నిర్ణయం తీసుకుని చరిత్రలో నిలిచిందన్నారు. రిజర్వేషన్ల పరిమితి పెంచడంపై ఆర్మూర్‌ పట్టణ బీసీల తరఫున సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు.