Homeజిల్లాలునిజామాబాద్​TWJF | జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

TWJF | జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ అడ్​హక్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TWJF | జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల (accreditation cards) గడువు తీరిపోయి ఏడాదిన్నర గడిచిందని, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ అడ్​హక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​కు (Additional Collector Kiran Kumar) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండలాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, అక్రమ కేసులు పరిపాటిగా మారాయన్నారు. వాటిని నివారించేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు రాంచందర్, భాస్కర్, వెంకటేష్, మధు, అనిత, పరమేశ్వర్, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.