అక్షరటుడే, వెబ్డెస్క్ : RRB Jobs | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(Railway Recruitment Board) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. పన్నెండో తరగతి విద్యార్హతతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3,050 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
RRB Jobs | భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 3,050.
పోస్టులవారీగా వివరాలు..
జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్(జనరల్) 163, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ (అకౌంట్స్) 394, ట్రైన్ క్లర్క్(ఆపరేటింగ్) 77, కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 2,424.
సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ పరిధిలో..
జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ (జనరల్) 11, ట్రైన్ క్లర్క్ (ఆపరేటింగ్) 5, కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 276.
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో (Intermediate) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/హిందీలో టైపింగ్ ప్రావీణ్యం అవసరం.
వయోపరిమితి : 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(OBC)లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల ప్రారంభ తేదీ : అక్టోబర్ 28
దరఖాస్తు గడువు : నవంబర్ 27.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్(EWS), ఓబీసీలకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ, ట్రాన్స్‌జెండర్లకు రూ. 250.
ఎంపిక విధానం : అన్ని పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2 నిర్వహిస్తారు. జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది.సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్(Skill Test) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అభ్యర్థులు ఎడిటింగ్ టూల్స్, స్పెల్ చెక్ సౌకర్యం లేకుండా పర్సనల్ కంప్యూటర్‌లో నిమిషానికి 30 పదాలు (డబ్ల్యూపీఎం), ఇంగ్లిష్ లేదా హిందీ(Hindi)లో నిమిషానికి 25 పదాలు టైప్ చేయాలి.
