HomeUncategorizedISRO Jobs | ఐటీఐతో ఇస్రోలో ఉద్యోగావకాశాలు.. 64 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

ISRO Jobs | ఐటీఐతో ఇస్రోలో ఉద్యోగావకాశాలు.. 64 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ISRO Jobs | ఐటీఐ(ITI), డిప్లొమా కోర్సులు పూర్తి చేసినవారికి ఇస్రో శుభవార్త చెప్పింది. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(VSSC)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తోంది. వీఎస్‌ఎస్‌సీలో టెక్నిషియన్‌, డ్రాట్స్‌మన్‌, ఫార్మసిస్ట్‌ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలన్నింటికీ పదో తరగతితో పాటు ఐటీఐ, డిప్లొమా(Diploma) కోర్సులను అర్హతగా ప్రకటించింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, పని అనుభవం ఉన్నవారు అర్హులు. పోస్టును అనుసరించి ప్రతినెలా రూ. 35 వేలనుంచి రూ. 1.18 లక్షల వరకు వేతనం అందుతుంది. దరఖాస్తు, ఇతర వివరాలకోసం https://rmt.vssc.gov.in లో సంప్రదించండి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

దరఖాస్తు రుసుము : రూ. 500. ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌తోపాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీని ప్రకటించాల్సి ఉంది.

భర్తీ చేసే పోస్టులివే..

  • ఫిట్టర్‌ విభాగంలో 20 పోస్టులు
  • ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 11 పోస్టులు
  • మెకానికల్‌ విభాగంలో 7 పోస్టులు
  • టర్నర్‌ విభాగంలో 6 పోస్టులు
  • మెషినిస్ట్‌ విభాగంలో 5 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 5 పోస్టులు
  • ఎలక్ట్రోప్లేటర్‌ విభాగంలో 3 పోస్టులు
  • వెల్డర్‌ విభాగంలో 2 పోస్టులు
  • ఎంఆర్‌ఏసీ విభాగంలో 1 పోస్టు
  • మెకానిక్‌(మోటార్‌ వేహికిల్‌/డీజిల్‌) విభాగంలో 1 పోస్టు
  • ఫొటోగ్రఫీ విభాగంలో 1 పోస్టు
  • కార్పొంటర్‌ విభాగంలో 1 పోస్టు
  • ఫార్మసిస్ట్‌ ఏ విభాగంలో 1 పోస్టు