అక్షరటుడే, వెబ్డెస్క్: TRAI | రిలయన్స్ జియో(Reliance Jio)కు మార్చిలో భారీగా సబ్స్కైబర్లు (jio Subscribers) పెరిగారు. మార్చి నెలకు సంబంధించిన వినియోగదారుల లెక్కలను ట్రాయ్(Trai) తాజాగా విడుదల చేసింది.
దీని ప్రకారం జియో(Jio)కు మార్చిలో కొత్తగా 21.74 లక్షల కస్టమర్లు యాడ్ అయ్యారు. ఎయిర్టెల్(Airtel)కు 12.50 లక్షల వినియోగదారులు, బీఎస్ఎన్ఎల్(BSNL)కు 49,177 సబ్స్కైబర్లు పెరిగారు. కాగా.. వొడాఫోన్ ఐడియా మాత్రం 5.41 లక్షల వినియోగదారులను కోల్పోయింది.
TRAI | 50శాతం వాటా జియోదే..
టెలికాం రంగంలో రిలయన్స్ జియో(Reliance Jio) ఆధిపత్యం కొనసాగుతోంది. టెలికాం మార్కెట్లో వైర్డ్, వైర్లెస్ నెట్వర్క్లో 50.48 శాతం కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉంది. సగానికి కంటే ఎక్కువ కస్టమర్లను(Customers) జియో కలిగి ఉండడం గమనార్హం. తర్వాత భారతి ఎయిర్టెల్ 30.64శాతం, వోడాఫోన్ ఐడియా 13.39, బీఎస్ఎన్ఎల్ 3.66 శాతం వాటా కలిగి ఉన్నాయి.