ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Jawan murali naik | నేడు ముర‌ళీ నాయ‌క్ అంత్యక్రియలు.. ఎవరెవరు హాజ‌రు కానున్నారంటే..!

    Jawan murali naik | నేడు ముర‌ళీ నాయ‌క్ అంత్యక్రియలు.. ఎవరెవరు హాజ‌రు కానున్నారంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jawan murali naik | భారత్ – పాక్ యుద్దంలో తెలుగుబిడ్డ వీరమరణం పొంద‌డంతో ప్ర‌తి ఒక్క‌రు భావోద్వేగానికి గుర‌య్యారు. చిన్న వ‌య‌స్సులోనే ముర‌ళీ నాయ‌క్ (Murali naik) అమ‌రుడ‌య్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా (sri sathyasai district) గోరంట్ల మండలంలోని (gorlantla mandal) గడ్డంతాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ కాల్పుల్లో క‌న్నుమూసారు. ఆయ‌న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు (banglore to kallithanda) తీసుకొచ్చారు. అయితే రోడ్డు పొడవునా జననీరాజనం పట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి జై జవాన్ అంటూ నినాద‌లు చేశారు. ముర‌ళీ నాయ‌క్ భౌతికకాయం వెంట ముందుకు సాగారు.

    Jawan murali naik | ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారు..

    నేటి సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్య‌క్రియలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP deputy CM pawan kalyan), హోంమంత్రి అనిత (home minister anitha), మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ (minister nara lokesh) తదితరులు పాల్గొంటారని స‌మాచారం. మరోవైపు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని (jawan murali naik family) సీఎం చంద్రబాబు (CM chandra babu naidu) పరామర్శించారు. మంత్రి సవిత (minister savitha) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రాబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద రూ.5 లక్షల చెక్కును వారికి ఇప్పించారు. మరోవైపు మాజీ సీఎం జగన్ (former CM jagan) కూడా బాధిత కుటుంబాన్ని ఫో‌న్‌లో పరామర్శించి, తాను ఎప్పుడూ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

    మురళీ నాయక్ కు (murali naik) దేశ భ‌క్తి చాలా ఎక్కువ‌. చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక ఉండేది. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరాడు. తొలుత పంజాబ్ (punjab), అస్సాంలలో (assam) పనిచేసి.. రెండున్నరేళ్ల సర్వీసు పూర్తికావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్‌ పూర్తి చేసుకుని వస్తాడని కలలు క‌న్నారు వారి త‌ల్లిదండ్రులు. ఒకే ఒక్క కుమారుడిని ఎంతో గారాబంగా పెంచుకున్నారు వారి త‌ల్లిదండ్రులు. కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణవార్తతో ఇక తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ గాయని మంగ్లీ (singer mangli) కల్లి తాండాకి వెళ్లి మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు ఆపరేషన్ సిందూర్ (operation sindoor) కోసం తన ప్రాణాలను అర్పించాడని కొనియాడారు. మహిళలు సిందూరం పెట్టుకునేటప్పుడు మురళీ నాయక్ వంటి జవాన్ల ప్రాణత్యాగాలను స్మరించుకోవాలని ఆమె కోరారు.

    Latest articles

    Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం...

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    More like this

    Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం...

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...